Minister KTR : మేమే గెలుస్తం మాదే రాజ్యం
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – తెలంగాణలో మరోసారి ఎగిరేది గులాబీ జెండానేనని , ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎంగా కొలువు తీరడం ఖాయమని జోష్యం చెప్పారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో చిట్ చిట్ నిర్వహించారు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister KTR Comment
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది తామేనని, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావన్నారు కేటీఆర్(Minister KTR). అన్ని పార్టీల కంటే ముందే తాము అభ్యర్థులను ప్రకటించామని, ఇది తమ పార్టీకి ఉన్న సమర్థత అన్నారు.
119 స్థానాలలో 100 స్థానాలు తప్పకుండా గెలుస్తామన్నారు కేటీఆర్. క్షేత్ర స్థాయి నుండి పట్టణ, నగర స్థాయిలో ప్రతి ఒక్కరు కేసీఆర్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలే చెబుతున్నారని ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు.
ప్రజలకు ఏం కావాలో, ఎవరిని ఎన్నుకోవాలనేది తెలుసన్నారు. కానీ ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. ఇక ఆయా పార్టీలు పోటీ పడాల్సింది రెండో స్థానం కోసమేనని పేర్కొన్నారు.
తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నేతలపై తనకు ఉన్న నమ్మకం మేరకే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి అభ్యర్థులుగా సీఎం ప్రకటించారని చెప్పారు. ఇవాళ ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
ఆయా పార్టీల భవిష్యత్తును ఢిల్లీలో నిర్ణయిస్తారని కానీ తెలంగాణలో బీఆర్ఎస్ లో కేవలం తమ నాయకుడు మాత్రమే నిర్ణయిస్తాడని చెప్పారు. తమ నాయకుడి పైనే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్ పార్టీదంటూ సెటైర్ వేశారు.
Also Read : Rahul Gandhi : ప్రజా సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం