CM KCR : అంగన్‌వాడీలకు సీఎం ఖుష్ కబర్
టీచర్లు, హెల్పర్లకు కేసీఆర్ శుభవార్త
CM KCR : హైదరాబాద్ – తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఎన్నికలు రానుండడంతో ఏది అడిగినా దానిని కాదనకుండా ఇచ్చేస్తున్నారు. రేపొద్దున తనకు ఓట్లు పడవేమోనన్న భయంతో. తాజాగా ఏళ్ల తరబడి వివిధ శాఖలలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. అందరూ ఇదే అసలైన సమయం అని రోడ్డెక్కారు. ఆందోళన బాట పట్టారు.
CM KCR Good News
తాజాగా సీఎం కేసీఆర్(CM KCR) సంచలన ప్రకటన చేశారు. అంగన్ వాడీలో పని చేస్తున్న టీచర్లు, హెల్పర్లకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందులో పని చేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక ఆర్థిక సాయం కింద మినీ అంగన్ వాడీ టీచర్లకు రూ. 1,00,000, హెల్పర్లకు రూ.50,000 అందజేస్తామన్నారు కేసీఆర్.
50 ఏళ్ల లోపు ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు 2 లక్షల రూపాయల బీమా సదుపాయం, 50 ఏళ్లు దాటిన వారికి 2 లక్షల రూపాయల వరకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. పని ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపడతామన్నారు. పదవీ విరమణ తర్వాత ఆసరా పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు కేసీఆర్.
Also Read : YS Sharmila : సీఎం..ఎన్నాళ్లిలా మోసం – షర్మిల