Cheekoti Praveen : చీకోటికి చేదు అనుభ‌వం

ముఖం చాటేసిన కిష‌న్ రెడ్డి

Cheekoti Praveen : హైద‌రాబాద్ – క్యాసినో కింగ్ మేక‌ర్ గా పేరు పొందిన చీకోటి ప్ర‌వీణ్ కు ఊహించ‌ని రీతిలో షాక్ త‌గిలింది. ఆయ‌న‌ను బీజేపీలోకి చేర్చుకునేందుకు ఢిల్లీ స్థాయిలో పావులు క‌దిపారు మాజీ బీజేపీ స్టేట్ చీఫ్ , క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

Cheekoti Praveen Got Shock

తీవ్ర ఆరోప‌ణ‌లు, కేసులు ఉన్న చీకోటి ప్ర‌వీణ్ ను ఎట్ట‌కేల‌కు పార్టీలో చేర్చుకునేందుకు పై స్థాయిలో మేనేజ్ చేసి ఒప్పించ‌డంలో స‌క్సెస్ అయ్యారు బండి. ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న ఉన్న స‌మ‌యంలో చీకోటి ప్ర‌వీణ్(Cheekoti Praveen) పార్టీలో తీర్థం పుచ్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

భారీ అనుచ‌ర గ‌ణంతో, ప్ర‌ద‌ర్శ‌న‌తో ర్యాలీగా హైద‌రాబాద్ లోని బీజేపీ పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. తీరా రా రమ్మంటూ పిలిచి మ‌రీ ఆహ్వానం ప‌లికిన బీజేపీ నేత‌లు ఉన్న‌ట్టుండి చీకోటి ప్ర‌వీణ్ కు హ్యాండిచ్చారు.

దీంతో చీకోటి ప్ర‌వీణ్ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. ఆయ‌న చేరిక‌ను పార్టీకి చెందిన సీనియ‌ర్లు కొంద‌రు అభ్యంత‌రం తెల‌ప‌డంతో పార్టీకి కొత్త చీఫ్ గా ఎంపికైన గంగాపురం కిష‌న్ రెడ్డి ఆఫీసు నుంచి జంప్ అయ్యారు.

దీంతో తాను ఎంతో ఆశ‌తో , మందీ మార్బ‌లంతో వ‌చ్చి హ‌డావుడి చేసిన చీకోటి ప్ర‌వీణ్ అనుచ‌రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు బీజేపీ అగ్ర నేత‌ల‌పై భ‌గ్గుమ‌న్నారు.

Also Read : CM KCR : అంగన్‌వాడీల‌కు సీఎం ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!