Priyank Kharge : ఆజ్ తక్ పై కాంగ్రెస్ సర్కార్ గుస్సా
పరువు నష్టం వేస్తామని ప్రకటన
Priyank Kharge : కర్ణాటక – ప్రముఖ మీడియా సంస్థ ఆజ్ తక్ పై నిప్పులు చెరిగింది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్న సమయంలో పనిగట్టుకుని తమపై సదరు మీడియా సంస్థ బురద చల్లుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Priyank Kharge Comments on Media Channel
సంస్థలో పని చేస్తున్న సుధీర్ చౌదరి ప్రభుత్వం హిందువులకు తప్ప మిగతా వారికి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం వెలువరించారు. దీనిపై సీరియస్ గా స్పందించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge). ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు మీడియా అంటే గౌరవం ఉందని, కానీ కావాలని ఒకరికి మేలు చేకూర్చేలా మరొకరిని డ్యామేజ్ చేసేలా వార్తలను, కథనాలను ప్రసారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఇది జర్నలిజం అనిపించుకోదని స్పష్టం చేశారు. తాము న్యాయపరంగా ఆజ్ తక్ సంస్థపై, అనుచిత, నిరాధార ఆరోపణలు చేసిన సుధీర్ చౌదరిపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే. ఇది మంచి పద్దతి కాదన్నారు. కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.
Also Read : Cheekoti Praveen : చీకోటికి చేదు అనుభవం