Bangalore Police Book : సుధీర్ చౌదరిపై కేసు నమోదు
కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫిర్యాదు
Bangalore Police Book : బెంగళూరు – ఆజ్ తక్ న్యూస్ ఛానల్ న్యూస్ ఎడిటర్ గా ఉన్న సుధీర్ చౌదరికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కర్ణాటకలో పోలీసు కేసు నమోదైంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్వాలంబన్ సారథి స్కీమ్ పై నిరాధార వార్తలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. కావాలని పనిగట్టుకుని తాము అమలు చేస్తున్న పథకం కొందరికే అందుతోందని పేర్కొన్నారంటూ ఆరోపించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే.
Bangalore Police Book Case
ఇందులో భాగంగానే తాము పరువు నష్టం కేసు దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ప్రియాంక ఖర్గే(Priyank Kharge) మీడియాతో మాట్లాడారు. తమకు మీడియా పట్ల గౌరవం ఉందని, కానీ ఆజ్ తక్ ఛానల్ ఎడిటర్ సుధీర్ చౌదరి కేవలం దురుద్దేశ పూర్వకంగా ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న స్వాలంబన్ సారథి స్కీమ్ హిందువులకు ఇవ్వడం లేదంటూ ఇందులో టెలికాస్ట్ చేశారు. ఇది పూర్తిగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మౌత్ పీస్ గా ఉండేలా చేశారంటూ సుధీర్ చౌదరిపై సంచలన ఆరోపణలు చేశారు ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే.
దీంతో శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ఇంకా స్పందించ లేదు సుధీర్ చౌదరి.
Also Read : YS Jagan Comment : జగన్ వ్యూహం చక్రబంధం