Yogendra Yadav : దేశానికి నిప్పు పెడుతున్న నేతలు
యోగీంద్ర యాదవ్ షాకింగ్ కామెంట్స్
Yogendra Yadav : న్యూఢిల్లీ – ప్రముఖ సామాజిక వేత్త యోగేంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్దంగా అధికారంలో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో దేశానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.
Yogendra Yadav Comments Viral
ప్రజాస్వామ్య యుతంగా గెలిచిన ప్రజలు దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయడం దారుణమన్నారు యోగేంద్ర యాదవ్(Yogendra Yadav). మన సంస్కృతి, నాగరికత ప్రాతిపదికన ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరగడమే నేడు దేశం ముందున్న అతి పెద్ద సవాలు అని హెచ్చరించారు.
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని దీనిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హెచ్చరించారు. ఒకందుకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొంత కదలిక తీసుకు వచ్చిన మాట వాస్తవమేనని , ఇలాంటి చైతన్యం కలిగించే ప్రజలతో మమేకం అయ్యే ప్రజా యాత్రలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు యోగేంద్ర యాదవ్.
ఇప్పటికైనా దేశ ప్రజలు మేలుకోక పోతే కొన్ని తరాల పాటు నష్ట పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు యోగేంద్ర యాదవ్. టెక్నాలజీ భూతాన్ని ముందు పెట్టి అభివృద్ది మంత్రం జపిస్తున్న వాళ్లకు దేశంలో ఇంకా పేదరికం ఉందన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : Ram Gopal Varma : లూథ్రా కత్తి పట్టమంటే ఎలా