Tummala Nageshwara Rao : కాంగ్రెస్ లో తుమ్మల చేరిక వాయిదా
ఎన్నికలు ఆలస్యం కావడంతో నిర్ణయం
Tummala Nageshwara Rao : ఖమ్మం – మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పునరాలోచనలో పడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కానీ తాజాగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
Tummala Nageshwara Rao Joining Postponed
ఇప్పట్లో ఎన్నికలు జరగవని, ఇంకా నోటిఫికేషన్ రాలేదని బహుశా వచ్చే ఏప్రిల్ , మే నెలల్లో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడే ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మల నాగేశ్వర్ రావు ఆలోచిస్తున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఈనెల 17న హైదరాబాద్ లో జరిగే సభకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా మేడం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారు.
అంతకు ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageshwara Rao) ఇంటికి స్వయంగా వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. అంతే కాకుండా తనకు పాలేరు సీటు కేటాయించే విషయంపై ఇంకా స్పష్టమైన హామీ రాక పోవడంతో తుమ్మల కొంత వెనుకంజ వేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తుమ్మల అయోమయంలో ఉన్నారు.
Also Read : Vijaya Sai Reddy : పురందేశ్వరిపై విజయ సాయి రెడ్డి ఫైర్