Ram Gopal Varma : పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ సెటైర్
ఎట్టకేలకు ప్రకటించారంటూ ఎద్దేవా
Ram Gopal Varma : హైదరాబాద్ – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన గత కొన్ని రోజులుగా నిరంతరం ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. శుక్రవారం మరో సంచలన ట్వీట్ చేశారు. నెటిజన్ల ప్రతిభకు పరీక్ష పెట్టారు. ఈసందర్బంగా ఓ ప్రశ్న వేశారు. చెప్పుకోండి చూద్దాం అంటూ తానే ఛాన్స్ కూడా ఇచ్చారు.
Ram Gopal Varma Comments Viral
కొన్నేళ్ల పాటు కలిసి ఉన్న జంట ఎట్టకేలకు పెళ్లిని ప్రకటించింది. నేను ఏ సందర్బంలో ఇలా చెప్పానో చెప్పగలరా అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇదంతా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ , నారా చంద్రబాబు నాయుడు గురించి అని తెలిసిన వారంటున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ కేసులో అడ్డంగా బుక్కైయిన మాజీ సీఎంతో పాటు నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ , బాలకృష్ణలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma ). ఆయన బాబుకు వ్యతిరేకంగా వ్యూహం పేరుతో ఓ సినిమా కూడా తీశారు.
ఆ మధ్యన పరిటాల రవికి సంబంధించి రక్త చరిత్ర పేరుతో మూవీ తీశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి చిత్రాన్ని తెరకెక్కించాడు. మొత్తంగా జగన్ కు అనుకూలంగా బాబుకు వ్యతిరేకంగా తన పంథా కొనసాగిస్తూ వస్తున్నాడు ఆర్జీవీ.
Also Read : Jyotiraditya Scindia : మాజీ సీఎంల పట్ల కోపం లేదు