AP CM YS Jagan : ఆరోగ్య రంగంలో ఏపీ ఆదర్శం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
AP CM YS Jagan : విజయనగరం – ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య రంగంలో ఏపీ ముందంజలో కొనసాగుతోందన్నారు. శుక్రవారం విజయనగరంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించారు.
AP CM YS Jagan Comments Viral
రాష్ట్రంలో ఇప్పటి వరకు 28 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఓ వైద్య కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు జగన్ రెడ్డి(AP CM YS Jagan ). అంతే కాకుండా ఏర్పాటు చేసిన వాటిలో, గతంలో ఉన్న వాటిలో సైతం మౌలిక వసతులను కల్పించనున్నట్లు చెప్పారు సీఎం.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నూతనంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
Also Read : Navadeep : డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు