MLC Kavitha : ఎమ్మెల్సీ క‌విత హాజ‌రు కావాల్సిందే

10 రోజుల స‌మ‌యం ఇస్తామ‌న్న ఈడీ

MLC Kavitha : హైద‌రాబాద్ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం త‌న‌యురాలు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు మ‌రోసారి షాక్ ఇచ్చింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ). ఇప్ప‌టికే ఇదే కేసుకు సంబంధించి ఆప్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాతో పాటు అర‌బిందో ఫార్మా డైరెక్ట‌ర్ శ‌ర‌త్ చంద్రా రెడ్డి, అరుణ్ రామ‌చంద్ర‌న్ పిళ్లై అరెస్ట్ అయ్యారు.

MLC Kavitha Viral on Liquor Scam

వీరిలో శ‌ర‌త్ చంద్రా రెడ్డి, పిళ్లై అప్రూవ‌ర్ గా మారిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని త‌ప్పు ప‌ట్టారు రామ‌చంద్ర‌న్ పిళ్లై. ఇదిలా ఉండ‌గా తాజాగా ఈ కేసుకు సంబంధించి ఇదే ఏడాది మార్చిలో మూడు సార్లు ఎమ్మెల్సీ కవితను(MLC Kavitha) ఈడీ విచారించింది. ఆమె హాజ‌ర‌య్యారు ఢిల్లీ ఆఫీసులో.

తాజాగా ఇదే కేసుకు సంబంధించి మ‌రోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. త‌మ ఎదుట హాజ‌రు కావాల‌ని. దీంతో క‌విత త‌న కేసు కోర్టులో విచార‌ణ‌లో ఉంద‌ని, ఈ స‌మ‌యంలో త‌న‌కు ఈడీ నోటీసు ఎలా జారీ చేస్తుంద‌ని ప్ర‌శ్నించారు. ఒక ర‌కంగా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈడీ ఇచ్చిన నోటీసుల‌పై కవిత సుప్రీంను ఆశ్ర‌యించ‌గా విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఈనెల 26 వ‌ర‌కు వాయిదా వేసింది. కావాలంటే 10 రోజుల స‌మ‌యం ఇస్తామ‌ని కానీ ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మ ఎదుట క‌విత హాజ‌రు కావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది.

Also Read : AP CM YS Jagan : ఆరోగ్య రంగంలో ఏపీ ఆద‌ర్శం

Leave A Reply

Your Email Id will not be published!