RK Roja Selvamani : టీడీపీకి పార్టీని తాకట్టు పెట్టిన పవన్
మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
RK Roja Selvamani : విజయవాడ – ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani) సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి పోయాడని అన్నారు. ఏకంగా 13 చోట్ల సంతకాలు చేశాడని, దానిని ఎలా మరిచి పోతారంటూ ప్రశ్నించారు.
RK Roja Selvamani Comments Viral
స్కీం స్కామ్ గురించి తెలుసు కోకుండానే పవన్ కళ్యాణ్ ఏదేదో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ముందు అసలు దొంగలు ఎవరో తెలిసి పోయాక ఇంకా కాదని బుకాయించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టలేదన్నారు. కేవలం వసూళ్ల కోసం, ప్యాకేజీల కోసం మాత్రమే తను పార్టీని నడుపుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
పవన్ కళ్యాణ్ పూర్తిగా టీడీపీకి జనసేన పార్టీని తాకట్టు పెట్టాడని ఇంతకంటే దౌర్భాగ్యమైన సన్నాసి ఇంకొకరు ఉండరంటూ నిప్పులు చెరిగారు మంత్రి. చంద్రబాబు సీట్లో కూర్చున్న బాలకృష్ణను చూసి చంద్రబాబు నాయుడు ఓర్వ లేక పోయాడని ఆరోపించారు.
ఏది ఏమైనా చంద్రబాబును చరిత్ర క్షమించదన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
Also Read : Vijay Sai Reddy : తోడేళ్ల ముఠాతో సింహం పోటీ
