CM KCR : అభివృద్ది నమూనా తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్
CM KCR : హైదరాబాద్ – సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్దిలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రతి రంగంలో ఇవాళ తెలంగాణ దూసుకు పోతోందని స్పష్టం చేశారు.
CM KCR Comments on Development
కొందరు పనిగట్టుకుని చేసిన విమర్శలను పట్టించు కోవాల్సిన అవసరం లేదన్నారు. సాధించుకున్న రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఇవాళ పాడి పంటలతో అలరారుతోందని, ఐటీ పరంగా దూసుకు పోతోందని, ఫార్మా రంగంలో ముందంజలో కొనసాగుతోందన్నారు.
ఇక వ్యవసాయ రంగం ఇవాళ కళ కళ లాడుతోందన్నారు. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న కృష్టి వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు కేసీఆర్(CM KCR). ఒకప్పుడు రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని కానీ ఇప్పుడు ఆ సంఖ్య 28కి చేరుకుందన్నారు.
ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది తన కల అని దానిని సాధించేంత వరకు నిద్ర పోనన్నారు కేసీఆర్. మాట ఇవ్వడం మడమ తిప్పడం తనకు రాదన్నారు. ఒక్కసారి చెప్పానంటే ఇక హరిహరాదులు అడ్డు వచ్చినా తాను వెనక్కి వెళ్లే ప్రసక్తి ఉండదన్నారు. ఇవాళ అభివృద్ది నమూనా అనేది దేశానికి తలమానికంగా ఉండబోతోందన్నారు కేసీఆర్.
Also Read : AP CID Chief : చంద్రబాబే సూత్రధారి – సంజయ్