Madhapur DCP : ఐటీ ఉద్యోగులకు పోలీస్ వార్నింగ్
టీడీపీ నేతలకు కూడా
Madhapur DCP : హైదరాబాద్ – ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్క బెడుతున్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేయడాన్ని తప్పు పట్టారు పోలీసులు.
Madhapur DCP Warning to IT Employees
ఈ మేరకు శుక్రవారం మాదాపూర్ డీసీపీ(Madhapur DCP ) సందీప్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి ఐటీ ఉద్యోగులు ఎవరైనా కానీ , తెలుగుదేశం పార్టీకి చెందిన వారు మీటింగ్ లు పెట్టినా లేదా ర్యాలీలు నిర్వహించాలని అనుకుంటే చెల్లదన్నారు.
ఆందోళనలు, నిరసనలకు తాము పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరి పనులు వారు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు.
హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేలా వ్యవహరిస్తే తాము ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు డీసీపీ సందీప్. ఇప్పటికే పలుమార్లు తెలియ చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి ఐటీ కంపెనీలకు కూడా సమాచారం అందజేశామన్నారు. ఏ మాత్రం గీత దాటితే చర్యలు తప్పవని స్ట్రాంగ్ గా హెచ్చరించారు డీసీపీ సందీప్.
Also Read : Nara Lokesh : ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ