Nallala Odelu : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన ఓదేలు
Nallala Odelu : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటి దాకా బీజేపీలో కొనసాగిన ఇద్దరు సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణా రెడ్డి, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుడ్ బై చెప్పారు.
Nallala Odelu Joins in Congress
బీజేపీ ఇప్పటి వరకు తెలంగాణ పట్ల సరైన స్టాండ్ తీసుకోలేదని పేర్కొన్నారు. ఆ ఇద్దరు నేతలు ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు. సంఘీభావం తెలిపారు. ఈ తరుణంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు ఒక్కరొక్కరు పార్టీని వీడుతున్నారు.
మొన్నటికి మొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గులాబీకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఇదే పార్టీకి చెందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు(Nallala Odelu) బిగ్ షాక్ ఇచ్చారు. ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
ఆ వెంటనే ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి తన భార్యతో సహా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
Also Read : Tirumala Kunkumarchana : ఘనంగా కుంకుమార్చన