Daggubati Purandeswari : చంద్రబాబు అరెస్ట్ దారుణం
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari : ఆంధ్రప్రదేశ్ – ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. చావు కబురు చల్లగా చెప్పారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్నారు.
Daggubati Purandeswari Comments Viral
ఈ అరెస్ట్ పై ఇప్పుడు స్పందించడం విస్తు పోయేలా చేసింది. ఆదివారం ట్విట్టర్ వేదికగా దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం అక్రమమని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు బీజేపీ చీఫ్.
బావ బాబును అరెస్ట్ చేయడాన్ని తాను ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన విధానం పూర్తిగా చట్ట విరుద్దంగా, అప్రజాస్వామ్యంగా ఉందన్నారు దగ్గుబాటి పురందేశ్వరి. పొత్తులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను తప్పుగా అనుకోవడం లేదన్నారు.
ఈ విషయానికి సంబంధించి పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకు వెళతామని, ఈ విషయాన్ని చేరవేస్తామని స్పష్టం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి. పార్టీ పరంగా తీసుకోవాల్సిన డెసిషన్ తన చేతుల్లో ఏమీ లేదన్నారు దగ్గుబాటి పురందేశ్వరి.
Also Read : Pawan Kalyan : జగన్ నువ్వెంత నీ బతుకెంత