Yennam Srinivas Reddy : యెన్నం కాంగ్రెస్ లోకి జంప్
ఖర్గే సమక్షంలో హస్తం గూటికి
Yennam Srinivas Reddy : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) ఆదివారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు టాక్రే కండువా కప్పారు.
Yennam Srinivas Reddy Join in Congress
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున వలసలు వస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత , ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఖమ్మం జిల్లాలో మంచి పట్టు కలిగిన నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మల్లికార్జున్ ఖర్గే సమంక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఇదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో చేరారు.
అంతకు ముందు చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందు వల్లనే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది బీజేపీ.
Also Read : Daggubati Purandeswari : చంద్రబాబు అరెస్ట్ దారుణం