RK Roja Selvamani : పవన్ నువ్వెంత నీ బతుకెంత
ఏపీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
RK Roja Selvamani : ఆంధ్రప్రదేశ్ – ఏపీలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారంలో ఉన్న జగన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.
జగన్ గురించి పవన్ కళ్యాణ్ తన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వెంత నీ బతుకెంత అని. దానికి మంత్రి రోజా(RK Roja Selvamani) ఆదివారం రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నువ్వెంత నీ బతుకెంత అని మండిపడ్డారు.
RK Roja Selvamani Comments on Pawan Kalyan
కొంచం నోరు జాగ్రత్త పెట్టుకోవాలని హెచ్చరించారు. నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే జనం చూస్తూ ఊరుకోరన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ కోసం బానిస లాగా మారి పోయిన నీకు జగన్ రెడ్డిని తిట్టే అర్హత ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు.
ఇంకోసారి ఇలాగే అవాకులు చెవాకులు పేలితే నీ గతం ఏమిటో , నీ చరిత్ర ఏమిటో బయటకు విప్పాల్సి వస్తుందని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు ఆర్కే రోజా సెల్వమణి. బాధ్యతతో ఉండాల్సిన నువ్వు ఇలా ప్రజలను రెచ్చ గొట్టేలా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఏదో ఒక రోజు నీకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఆర్కే రోజా సెల్వమణి.
Also Read : Margadarshi Chit Case : మార్గదర్శి ఎండీ జంప్ – సీఐడీ