Suman Bose : స్కిల్ స్కామ్ జరగలేదు – సుమన్ బోస్
సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ
Suman Bose : న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీం స్కామ్ లో ఏకంగా రూ. 371 కోట్లు చేతులు మారాయని ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ స్కీంకు సంబంధించి సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ఆనాటి సర్కార్.
Suman Bose Comments Viral
ఈ మొత్తం వ్యవహారంపై సిమెన్స్ కంపెనీ మాజీ మేనిజింగ్ డైరెక్టర్ సుమన్ బోస్ తీవ్రంగా స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్ జరగలేదని పేర్కొన్నారు.
ఇందులో ఎలాంటి డబ్బులు చేతులు మారలేదన్నారు. బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ ఫర్ ఆపరేట్ పద్దతిలో ఈ ప్రాజెక్టు కొనసాగిందని చెప్పారు.
ఆదివారం సుమన్ బోస్(Suman Bose) మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం చేసిన ఆరోపణలు అన్నీ అబద్దమన్నారు. 2021 వరకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 2 లక్షల 13 వేల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు.
ఆ తర్వత ట్రైనింగ్ సెంటర్లను ఏపీ సర్కార్ కు అప్పగించడం జరిగిందన్నారు. ఏపీఎస్ఎస్ డీసీలో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు సుమన్ బోస్.
Also Read : RK Roja Selvamani : పవన్ నువ్వెంత నీ బతుకెంత