Congress On Parliament : ప్రజా దేవాలయం పార్లమెంట్
ఏఐసీసీ చీఫ్ ఖర్గే..చౌదరి
Congress On Parliament : న్యూఢిల్లీ – భారత దేశ చరిత్రలో సువర్ధాధ్యాయం మొదలైంది. భారీ ఖర్చుతో నూతనంగా నిర్మించిన పార్లమెంట్ ప్రారంభమైంది. దీనికి స్పీకర్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా అని పేరు కూడా పెట్టారు. ఈ సందర్బంగా చరిత్రాత్మకమైన మహిళా బిల్లును ప్రవేశ పెట్టారు.
Congress On Parliament Comments Viral
బిల్లు అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), కాంగ్రెస్ ఎంపీలు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మహిళా బిల్లును ఎలా ప్రవేశ పెడతారంటూ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడను తప్పుపట్టారు.
పార్లమెంట్ భవనం కాదు ప్రజా దేవాలయమని స్పష్టం చేశారు. దేశ ప్రజల గొంతును ప్రతిధ్వనించేలా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం మార్గదర్శకంగా కొనసాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య రాజకీయాలకు పునాదిగా ఉందన్నారు.
ఈ సెంట్రల్ హాల్ లోనే 1946 నుండి 1949 వరకు 2 సంవత్సరాల 11 నెలల, 17 రోజుల పాటు రాజ్యాంగ సభ తన సమావేశాలను నిర్వహించిందని గుర్తు చేశారు. భారత దేశ వాస్తు శిల్పులుగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ, పటేల్ , డాక్టర్ బీఆర్ అంబేద్కర్ , తదితర మహానుభావులు చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు ఖర్గే, చౌదరి.
Also Read : Revanth Reddy : కేసీఆర్ కు కాలం చెల్లింది – రేవంత్