Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.58 కోట్లు
తిరుమలను దర్శించుకున్న భక్తులు 67,267
Tirumala Hundi : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ యధావిధిగా కొనసాగుతూనే ఉంది. మరో వైపు ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు గానే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.
Tirumala Hundi Profits
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు కల్పించినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి స్పష్టం చేశారు.
నిన్న తిరుమలలో కొలువైన శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగమ్మలను 67 వేల 267 మంది భక్తులు దర్శించుకున్నారు. 20 వేల 629 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రతినిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.58 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఇక స్వామి వారి దర్శనం కోసం కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న వారికి కనీసం 3 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపింది. టోకెన్లు లేకుండా వేచి ఉన్న భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కలగనుందని పేర్కొంది టీటీడీ.
Also Read : Congress On Parliament : ప్రజా దేవాలయం పార్లమెంట్