Rahul Gandhi : రైల్వే కూలీల‌తో రాహుల్ గాంధీ

కార్మికుల‌తో మాట్లాడిన ఎంపీ

Rahul Gandhi : న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. గురువారం రాహుల్ గాంధీ ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యారు. కార‌ణం ఏమిటంటే ఆయ‌న రైల్వే కూలీ అవ‌తారం ఎత్తారు.

ఇవాళ ఢిల్లీ లోని ఆనంద్ విహార్ రైల్వే స్టేష‌న్ లోని కార్మిక సోద‌రుల‌తో స‌మావేశం అయ్యారు. ఇటీవ‌ల రైల్వే స్టేష‌న్ లో ప‌ని చేస్తున్న కార్మికులు రాహుల్ గాంధీతో క‌ల‌వాల‌ని కోరుకున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న‌కు చేర వేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు.

Rahul Gandhi Meet Railway Workers

దీంతో విష‌యం తెలిసిన వెంట‌నే రాహుల్ గాంధీ(Rahul Gandhi) రైల్వే కార్మికుల కోరిక‌ను మ‌న్నించారు. వారి కోసం తాను కూడా కూలీగా మారి పోయారు. వారు ప్ర‌తిరోజూ వేసుకునే డ్రెస్సుల‌ను తాను కూడా ధ‌రించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌యాణీకుల‌కు సంబంధించిన ఓ సూట్ కేస్ ను కూడా మోశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వైర‌ల్ అయ్యాయి.

రాహుల్ గాంధీ ప్రజా నాయ‌కుడిగా పేరు పొందారు. ఆయ‌న తన రూట్ మార్చారు. భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన త‌ర్వాత పూర్తిగా మారి పోయారు. ప్ర‌జా నాయ‌కుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు.

Also Read : AP Speaker Warning : బాల‌య్య‌ను హెచ్చ‌రించిన స్పీక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!