CM KCR : ఆత్మీయుడిని కోల్పోయా – కేసీఆర్
కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతిపై సంతాపం
CM KCR : పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్(CM KCR). శనివారం ఆయన స్పందించారు. హరీశ్వర్ రెడ్డి లేరన్న వార్త తనను కలిచి వేసిందన్నారు. తనకు అత్యంత ఆత్మీయుడని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నట్లు తెలిపారు.
CM KCR Feels Bad
తామిద్దరం మంచి స్నేహితులమని, చివరి వరకు ప్రజల కోసం పని చేశారని గుర్తు చేసుకున్నారు. కొప్పుల మృతి పార్టీకి తీరని లోటు , ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు స్పష్టం చేశారు కేసీఆర్. టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు.
ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా హరీశ్వర్ రెడ్డి తనయుడే ఉన్నారు. కాగా హరీశ్వర్ రెడ్డి కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయ పరంగా అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మార్చి 18, 1947లో పరిగిలో పుట్టారు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
1986 నుండి 1988 దాకా ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా , 1988 నుండి 1989 వరకు టీటీడీ సభ్యుడిగా పనిచేశారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1994, 1999, 2004 , 2009లో పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా శాసన సభ్యుడిగా గెలుపొందారు.
1997 నుండి 2003 దాకా రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ గా, డిసెంబర్ 31, 2001 నుండి నవంబర్ 14, 2003 దాకా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు.
Also Read : Koppula Harishwar Reddy : కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూత