Mynampally Hanumantha Rao : బీఆర్ఎస్ కు మైనంపల్లి గుడ్ బై
కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎమ్మెల్యే
Mynampally Hanumantha Rao : హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తన తనయుడికి టికెట్ కేటాయించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా బీఆర్ఎస్ పార్టీ బాస్, సీఎం కేసీఆర్ 119 సీట్లకు గాను 115 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. మిగతా సీట్లను తర్వాత ప్రకటిస్తానని తెలిపారు. ఇదే సమయంలో తిరుమలకు తన కుటుంబీకులతో దర్శనం కోసం వెళ్లిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumantha Rao) తనకు, తన తనయుడికి టికెట్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mynampally Hanumantha Rao Resigned from BRS Party
ఆపై తన తనయుడికి టికెట్ రాకుండా చేయడంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కారణమంటూ మండిపడ్డారు. ఆపై సంచలన ఆరోపణలు చేశారు. ఒకనాడు స్లిప్పర్లతో తిరిగిన హరీశ్ రావుకు ఇవాళ లక్ష కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని ప్రకటించారు. తాను పార్టీని అనలేదని కేవలం మంత్రిని మాత్రమే టార్గెట్ చేశానని స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ బాస్ ఒప్పు కోలేదు. చివరకు రాజీనామా చేయక తప్పలేదు మైనంపల్లికి. తనతో పాటు కొడుకుతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
Also Read : CM KCR : ఆత్మీయుడిని కోల్పోయా – కేసీఆర్