Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా శనివారం తీవ్రంగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బెయిల్ డే 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
దీనిపై తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ నేతలు. ప్రత్యేకించి ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయ సాయి రెడ్డి గత కొన్ని రోజుల నుంచి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్(Nara Lokesh) , నందమూరి బాలకృష్ణలను టార్గెట్ చేశారు. ప్రతి రోజూ సెటైర్లు వేశారు ఎంపీ.
Nara Lokesh Slams YS Jagan
నారా లోకేష్ దీనికి ఘాటుగా జవాబు ఇచ్చారు. రూ. 42 వేల కోట్ల ప్రజా ధనం లూటీ చేశాడని గుర్తు చేశారు. సీబీఐ , ఈడీ పెట్టిన 38 కేసులలో ఏ1 అయినా 10 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తూ రాజ్యాంగాన్ని కాల రాస్తూ నీతి మంతులను జైలుకు పంపిస్తున్నాడంటూ ఆరోపించారు. జైలు లో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఉంటే జనంలో ఉండాల్సిన నిజాయితీ పరుడు చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారంటూ పేర్కొన్నారు నారా లోకేష్.
Also Read : Kamal Haasan : ఉదయనిధి కామెంట్స్ సబబే – కమల్