Chandra Babu Naidu : సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్
ఏపీ హైకోర్టు ఆదేశాలు రద్దు చేయాలి
Chandra Babu Naidu : న్యూఢిల్లీ – ఏపీ టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపీ స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ సీఐడీకి రెండు రోజుల కస్టడీకి ఇచ్చింది. మరో వైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని, క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసిన బాబుకు షాక్ ఇచ్చింది హైకోర్టు. క్వాష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది.
Chandra Babu Naidu Approaching Supreme Court
దీంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) తరపు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో తనను కావాలని ఇరికించారంటూ ఆరోపించారు టీడీపీ చీఫ్. రాజకీయంగా అపారమైన అనుభవం తనకు ఉందన్నారు.
జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో అవినీతి ఆరోపణల కేసులో తనను పోలీస్ కస్టడీకి పంపిన హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థించారు.
ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థలో స్కిల్ స్కీంలో నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి రూ. 371 కోట్లకు పైగా నష్టం వాటిల్లిలే చేశారంటూ ఆరోపించింది ఏపీ సీఐడీ.
Also Read : Botsa Satayanarayana : చంద్రబాబు దొరికిన దొంగ