Surya Prabha Vahanam : సూర్య ప్రభ వాహనంపై శ్రీ మలయప్ప
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Surya Prabha Vahanam : తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు సూర్య మండల మధ్యస్తుడై హిరణ్మయ స్వరూపుడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
Surya Prabha Vahanam in Tirumala
శ్రీ మలయప్ప స్వామి వారు శంఖు చక్రాలు, కత్తి, విల్లు, బాణం, వరద హస్తంతో ఊరేగారు తిరుమల వీధుల్లో. ఇదిలా ఉండగా తిరుమలలో ప్రతి ఏటా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ(TTD) భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
ఇక సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్య ప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే.
అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగ భాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయు రారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు అనుగ్రహిస్తారు.
Also Read : AP CID : 7 గంటల పాటు బాబు విచారణ