CP CV Anand : ముస్లిం మత పెద్దలకు థ్యాంక్స్
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
CP CV Anand : హైదరాబాద్ – నగర పాలక కమిషనర్ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 28న వినాయకుడి నిమజ్జనం హైదరాబాద్ లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇవాళ మత పెద్దలతో సమావేశం కావడం జరిగిందని చెప్పారు.
CP CV Anand Apreciated to Muslims
ప్రధాన కారణం ఏమిటంటే వినాయక నిమజ్జనం రోజునే ముస్లింలకు సంబంధించి సెప్టెంబర్ 28న మిలాద్ ఉన్న నబీ సందర్భంగా జూలూస్ ఉంటుందని , వినాయక పండుగను పురస్కరించుకుని మత పెద్దలు వాయిదా వేయడం జరిగిందని సీపీ ఆనంద్ చెప్పారు.
గణేష్ అంతిమ నిమజ్జనం అక్టోబర్ 1న జరుగుతుందని, ఇందు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు సీపీ(CP CV Anand). ఇదే సమయంలో అక్టోబర్ 2న మిలాద్ ఉన్ నబీ జూలూస్ చేపట్టేందుకు మత పెద్దలు ఒప్పుకున్నారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని స్పష్టం చేశారు సీపీ ఆనంద్.
మన భాగ్య నగరం గంగా జమున తహజీబ్ కు ప్రతీక అని మరోసారి నిరూపించారని కొనియాడారు. ఈ నగరం గొప్పతనం కాపాడేందుకు హిందువులు, ముస్లింలు సహకరించాలని కోరారు పోలీస్ కమిషనర్.
Also Read : AP Police : ఏపీలో భద్రత కట్టుదిట్టం