AP CID : ఏపీ సీఐడీ ప్రశ్నల వర్షం
ముగిసిన చంద్రబాబు విచారణ
AP CID : రాజమండ్రి – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాల్టితో ఏపీ సీఐడీ విచారణ ముగిసింది.
AP CID Questions to Chandrababu
తొలి రోజు 7 గంటల పాటు రెండో రోజు 14 గంటల పాటు విచారించారు ఏపీ మాజీ సీఎంను. పలు ప్రశ్నలు సంధించారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) అవసరమైన సమయంలో విరామం ఇచ్చారు.
విచారణ కంటే ముందు ఆరోగ్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా బాబును విచారించే సమయంలో మొత్తం రికార్డ్ చేశారు. స్కిల్ స్కాంకు సంబంధించి రూ. 371 కోట్లు ఎక్కడికి వెళ్లాయంటూ ప్రశ్నించారు సీఐడీ అధికారులు.
షెల్ కంపెనీల వివరాలు ఎక్కడున్నాయని అడిగారు. ఇదే సమయంలో తన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఎక్కడున్నాడని ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సోమవారం చంద్రబాబు నాయుడుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై విచారణకు రానుంది. ఇప్పటికే ఏసీబీ కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
Also Read : Chandra Babu Remand : చంద్రబాబుకు బిగ్ షాక్