TDP PAC : 14 మందితో కమిటీ ఏర్పాటు
ప్రకటించిన టీడీపీ చీఫ్
TDP PAC : తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏపీ స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ చేయడంతో ఎలా ప్రభుత్వంతో ఎదుర్కోవాలనే దానిపై టీడీపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు రాజకీయ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు కొనసాగాయి.
TDP PAC Committee
ఇందులో భాగంగా 14 సీనియర్ నాయకులతో రాజకీయ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులకు చోటు కల్పించారు. వారిలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, కింజారపు అచ్చెన్నాయుడు(Atchannaidu), నారా లోకేష్ , పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, షరీఫ్ , అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, నిమ్మల రామానాయుడు , కాలవ శ్రీనివాసులు , అనిత , బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర , బీద రవిచంద్రలను నియమించారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పటికీ పార్టీ ఎలా వ్యవహరించారనే దానిపై ఫోకస్ పెట్టారు. బాబు ఆదేశాల మేరకు కింజారపు అచ్చెన్నాయుడు కమిటీ సభ్యుల పేర్లను విడుదల చేశారు.
వచ్చే వారం నుంచి యువగళం కార్యక్రమం చేపట్టాలని నారా లోకేష్ నిర్ణయించారు. కాగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్చంధంగా మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
Also Read : Somireddy Chandra Mohan Reddy : లోకేశ్ అరెస్ట్ కు కుట్ర