Daggubati Purandeswari : బుగ్గనపై పురందేశ్వరి ఫైర్
ఆయన చెప్పేవన్నీ అబద్దాలే
Daggubati Purandeswari : ఆంధ్ర ప్రదేశ్ – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకు సర్కార్ అనుసరిస్తున్న విధానాల వల్ల యువత, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Daggubati Purandeswari Slams YSRCP Govt
రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు తెలియ చెప్పేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. కానీ ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అన్నీ అవాస్తవాలు చెప్పారంటూ పేర్కొన్నారు పురందేశ్వరి.
వాస్తవాలను దాచి పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నాడని, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు జగన్ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు పురందేశ్వరి.
ఇదే సమయంలో ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఇవాళ సామాజిక మాధ్యమాలు పని చేస్తున్నాయని ప్రశంలసు కురిపంచారు. జగన్ అప్రజాస్వామిక పాలన గురించి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతం చేస్తామని స్పష్టం చేశారు.
Also Read : TDP PAC : 14 మందితో కమిటీ ఏర్పాటు