Telangana Villages : తెలంగాణ పల్లెలకు పురస్కారం
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Telangana Villages : హైదరాబాద్ – తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రత్యేకించి గ్రామాలు అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు దార్శనికుడైన సీఎం కేసీఆర్.
Telangana Villages Viral
ఆయన చేపట్టిన హరితహారం కారణంగా పల్లెలు పచ్చదనంతో అలరారుతున్నాయి. ఇక నిర్మించిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల కారణంగా నిన్నటి దాకా నెర్రలు బారిన పొలాలు ఇప్పుడు కళ కళ లాడుతున్నాయి.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ప్రగతి పథంలో ప్రయాణం చేస్తున్న పల్లెలకు అవార్డులను ప్రకటించింది. ఇందుకు సంబంధించి మంగళవారం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం జరగనుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పల్లెలను కూడా ఎంపిక చేసింది. తాజాగా కేంద్రం ప్రకటించిన ఉత్తమ టూరిజం విలేజ్ అవార్డులకు రెండు జిల్లాలలోని ఊర్లు ఎంపికయ్యాయి.
వాటిలో ఒకటి సీఎం కేసీఆర్(KCR) ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా లోని చంద్లాపూర్ గ్రామం ఎంపికైంది. రెండో పల్లె జనగాం జిల్లాలోని పెంబర్తి ఎంపికైంది. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ పాలనకు దర్పణం పడుతుందన్నారు.
Also Read : Paritala Sunitha : పరిటాల సునీత దీక్ష భగ్నం