GV Harsha Kumar : దర్యాప్తు సంస్థల తీరు దారుణం
మాజీ ఎంపీ హర్ష కుమార్
GV Harsha Kumar : ఆంధ్ర ప్రదేశ్ – మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్ష కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
GV Harsha Kumar Comments on AP CID
రాష్ట్రంలో పాలన పక్కదారి పట్టిందన్నారు. అసలు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడం లేదని పేర్కొన్నారు. కొండను తవ్వి చివరకు ఎలుకలు పట్టినట్టుగా ఏపీ సీఐడీ విచారణ కొనసాగుతోందంటూ మండిపడ్డారు ఎంపీ హర్ష కుమార్(GV Harsha Kumar).
సీఐడీ, ఏసీబీ కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్నట్లుగా తనకు అనిపిస్తోందన్నారు. మరి తాము ఆరోపించిన రూ. 371 కోట్లు ఎక్కడికి పోయాయో ఆధారాలు చూపాలన్నారు. ఏదీ లేకుండా ఎవరో ఆరోపణలు చేసినంత మాత్రాన దానిని ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు.
ఇలాంటి వ్యవస్థలను తాను ఎక్కడా చూడలేదన్నారు. మరో వారం రోజుల కస్టడీకి కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది తనను విస్తు పోయేలా చేసిందంటూ పేర్కొన్నారు ఎంపీ హర్ష కుమార్.
Also Read : Telangana Villages : తెలంగాణ పల్లెలకు పురస్కారం