AP CID : ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేష్ పాత్ర
లోకేష్ ను ఎ14గా చేర్చిన ఏపీ సీఐడీ
AP CID : అమరావతి – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తన తండ్రి, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత కొంత కాలం నుంచి ఏపీ సీఐడీ తనయుడు నారా లోకేష్ కు కూడా భాగం ఉందంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది.
AP CID Comments Viral
మంగళవారం ఏపీ సీఐడీ(AP CID) విస్తు పోయేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో స్కాం చోటు చేసుకుందని ఆరోపించింది. ఇందుకు తమ వద్ద తగినంత ఆధారాలు ఉన్నాయంటూ పేర్కొంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో నారా లోకేష్ పాత్ర ఉందని కుండ బద్దలు కొట్టింది. ఏ14గా ఆయన పేరును చేర్చినట్లు తెలిపింది. దీంతో అరెస్ట్ కు రంగం సిద్దం చేసినట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. మరో వైపు తాను అరెస్ట్ కు భయపడనంటూ గత కొంత కాలం నుంచి ప్రకటిస్తూ వస్తున్నారు.
కానీ ఇప్పటి దాకా ఏపీలో లేరు. ఢిల్లీలోనే మకాం వేశారు. లాయర్లను, ఇతర నేతలను కలుస్తున్నారు. ఒకవేళ ఏపీకి వస్తే వెంటనే అదుపులోకి తీసుకునే ప్రమాదం లేక పోలేదు.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ