Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఊరట
నవంబర్ 20న విచారిస్తామన్న సుప్రీం
Delhi Liquor Scam : న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కేసుకు సంబంధించి తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
Delhi Liquor Scam Viral
ఇదే ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి గత మార్చి నెలలో మూడుసార్లు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఢిల్లీలోని ఈడీ ఆఫీసు ముందు విచారణకు హాజరైంది. ఈ స్కాంలో కీలకమైన పాత్ర పోషించిందని పేర్కొంది. సంచలన ఆరోపణలు చేసింది దర్యాప్తు సంస్థ.
కాగా తన తండ్రి సీఎంగా ఉండడం వల్లనే కేంద్రం ఒత్తిడితో తనను ఇరికించాలని చూస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని తప్పు పట్టింది.
తాను మహిళనని, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈడీ వ్యవహరించిందని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్బంగా ఈడీ సుప్రీంకోర్టు విచారణ చేపట్టేంత వరకు తాము సమన్లు ఇవ్వబోమంటూ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసును నవంబర్ 20కి వాయిదా వేస్తున్నట్లు ఎస్సీ ప్రకటించింది.
Also Read : AP CID : ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేష్ పాత్ర