Bandi Sanjay : తాంత్రిక పూజలతో కేసీఆర్ బిజీ
బొట్టు పెట్టినా..నిమ్మకాయ ఇచ్చినా తీసుకోవద్దు
Bandi Sanjay : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి బీఆర్ఎస్ చీఫ్ , సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. కేసీఆర్ బొట్టు పెట్టినా లేదా నిమ్మకాయ ఇచ్చినా తీసుకోవద్దని సూచించారు.
Bandi Sanjay Slams CM KCR
ఎందుకంటే ఆయన తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ తాంత్రిక పూజలు చేయడంలో ఆరి తేరాడని మండిపడ్డారు. ఇలాంటివి ఆయనకు కొత్త కాదన్నారు. ఇతర పార్టీల్లోని నాయకులు, తమ పార్టీలో చెబితే వినని నేతలను నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు బండి సంజయ్(Bandi Sanjay) . అంతే కాదు శక్తివంతమైన తాంత్రికులను తీసుకు వచ్చి పూజలు చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు.
ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నాడని, ఇప్పుడు ఆయన గెలిచే పరిస్థితి లేదన్నారు. ఈ తరుణంలో తాంత్రిక పూజలను నమ్ముకుని ముందుకు సాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.
కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, లేదా ఇంకెన్ని పూజలు నిర్వహించినా రాబోయే ఎన్నికల్లో అడ్డంగా ఓడి పోవడం ఖాయమని పేర్కొన్నారు. స్కీంల పేరుతో స్కాంలకు పాల్పడిన కేసీఆర్ ను ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు.
Also Read : AP High Court : పుంగనూరు అల్లర్ల కేసుపై తీర్పు రిజర్వ్