Tirumala Rush : తిరుమల – కోట్లాది మంది కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల భక్తులతో నిండి పోయింది. నిన్న స్వామి వారికి సంబంధించి శనివారం రోజు కావడంతో భారీ ఎత్తున తరలి వచ్చారు. తండోప తండాలుగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).
Tirumala Rush with Devotees
శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగమ్మలను 87 వేల 81 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి 41 వేల 575 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రతి రోజూ శ్రీవారికి సంబంధించి నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 4.05 కోట్ల ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెల్లడించింది.
తిరుమలలో స్వామి వారి దర్శనం కోసం భక్తుల క్యూ లైన్ ఆక్టోపస్ బిల్డింగ్ దాకా ఉంది. ఇదే సమయంలో ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇదిలా ఉండగా ఇటీవల కాలి నడకన వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చేతి కర్రలను అందిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
Also Read : AP Pensions : ఏపీలో పెన్షన్ల పంపిణీ జాతర