Appalayagunta Utsavalu : శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి ఉత్సవాలు
10 నుండి 12వ తేదీ దాకా
Appalayagunta Utsavalu : అప్పలాయగుంట – తిరుపతిలో అత్యంత ప్రసిద్ది పొందిన పుణ్యక్షేత్రం అప్పలాయగుంట . ఇక్కడ శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా అక్టోబర్ 10 నుండి 12వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు కొనసాగనున్నాయి.
Appalayagunta Utsavalu in Tirumala
వీటిని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు . ఇందుకు గాను అక్టోబర్ 9న సాయంత్రం అంకురార్పణ జరగనుంది. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలను నిర్వహించడం పరిపాటి.
శ్రీ ప్రసన్న శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు తొలి రోజు అక్టోబర్ 10న పవిత్ర ప్రతిష్ట చేపడతారు. 11న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు నిర్వహిస్తారు. 12న మహా పూర్ణా హుతి, పవిత్ర విసర్జన జరగనుంది. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాలు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో చేపడతారు.
Also Read : Tirumala Rush : తిరుమలలో పోటెత్తిన భక్తజనం