YS Sharmila Join : హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఆమె చేరడం ఖాయమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తాను పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు గాను షర్మిల(YS Sharmila) కండీషన్స్ కూడా పెట్టినట్టు టాక్.
YS Sharmila Join May be
దీనికి కూడా ఏఐసీసీ ఓకే చెప్పిందని ఇక పార్టీ తీర్థం పుచ్చుకోవడం మాత్రమే మిగిలి ఉందని వైసీపీ తెలంగాణ పార్టీ నేతలు అంటున్నారు. చేరిక సందర్భంగా తనకు ఖమ్మం లోక్ సభ ఎంపీ సీటుతో పాటు ప్రియాంక గాంధీ ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి హోదా కావాలని కూడా కోరినట్లు తెలిసింది.
ఈ రెండు కోరికలను కూడా ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఓకే చెప్పారని దీనికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇక చేరేందుకు రేపో లేదా ఎల్లుండో ఢిల్లీకి ప్రయాణం చేయనున్నట్లు టాక్.
షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని ఆ పార్టీలో కొందరు నేతలు వ్యతిరేకిస్తుండగా మరికొందరు మద్దతు ఇస్తున్నారు. మొత్తంగా గత కొంత కాలంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పలుమార్లు షర్మిల జర్నీ చేశారు. కేవలం చర్చలు కొనసాగాయి. ఇప్పుడు కండువా కప్పుకోవడమే మిగిలి ఉంది.
Also Read : Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు దీక్ష హాస్యాస్పదం