Revanth Reddy Petition : రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్
ఓటుకు నోటు కేసులో పిటిషన్ డిస్మిస్
Revanth Reddy Petition : న్యూఢిల్లీ – తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ , మల్కాజ్ గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన ఇప్పటికే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యారు. బెయిల్ పై తిరిగి బయటకు వచ్చారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారు.
Revanth Reddy Petition Dismissed
మరో వైపు ఆనాడు టీడీపీలో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కేసు మూలకు పడింది. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో మరోసారి తెర పైకి వచ్చింది ఓటుకు నోటు కేసు.
తాజాగా ఓటుకు నోటు కేసులో తనకు ఊరటను ఇచ్చేలా తీర్పు ఇవ్వాలని కోరుతూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారించింది కోర్టు. ఏకంగా రేవంత్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
ఇదిలా ఉండగా 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇచ్చారంటూ రేవంత్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. కాగా ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని, దానిని కొట్టి వేయాలంటూ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో రాష్ట్రానికి సీఎం కావాలని కలలు కంటున్న రేవంత్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది.
Also Read : Dial Your 112 : కేంద్రం సంచలన నిర్ణయం