Chandra Grahanam : 28న శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా నిర్ణయం
Chandra Grahanam : తిరుమల – ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని అక్టోబర్ 28న మూసి వేయనున్నారు. ఆరోజు చంద్రగ్రహణం ఉండడంతో ఎనిమిది గంటలకు పైగా స్వామి వారి ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారికంగా వెల్లడించింది.
Chandra Grahanam Updates
29న తెల్లవారుజామున పాక్షిక చంద్ర గ్రహణం కారణంగా రాత్రి మూసి వేయనున్నట్లు తెలిపింది. తిరిగి అక్టోబర్ 29న ఆలయాన్ని తెరుస్తారని టీటీడీ ప్రకటించింది. 29వ తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్ర గ్రహణం పూర్తవుతుంది.
అక్టోబర్ 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేస్తారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసి ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. మరుసటి రోజు తెల్ల వారు జామున 3.15 గంటలకు ఏకాంతంలో శుద్ది, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు.
చంద్ర గ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయని పేర్కొంది టీటీడీ.
దీని కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయో వృద్దుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది.
Also Read : Minister KTR : అబద్దాలకు కేరాఫ్ రేవంత్ -కేటీఆర్