TTD Donation : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరు పొందారు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ. కోట్లాది మంది భక్తులు నిత్యం కానుకలు, విరాళాలు సమర్పిస్తూ వస్తారు. తాజాగా మహారాష్ట్ర లోని అమరావతికి చెందిన రిద్ది, సిద్ది ట్రేడర్స్ చీఫ్ విపుల్ వెనిశ్యామ్ అగర్వాల్ 11 లక్షల రూపాయలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు విరాళంగా అందజేశారు.
TTD Donation Viral
తిరుపతి(TTD) లోని ఎస్వీబీసీ కార్యాలయంలో సిఈవో షణ్ముఖ్ కుమార్ కు విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. దాత తరపున ప్రతినిధులు వై రాఘవేంద్ర, బాల సుందర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఇదిలా ఉండగా ట్రస్టుకు విరాళం అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు సిఈవో షణ్ముఖ్ కుమార్.
మరో వైపు ఎస్వీబీసీ ఛానల్ ను కోట్లాది మంది వీక్షిస్తున్నారు. భారీ ఎత్తున రేటింగ్ ఉంటోంది. నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి జరిగే పూజలు, హాజరయ్యే భక్తులు, ఇతర కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తోంది ఎస్వీబీసీ.
ఇదే సమయంలో గతంలో తెలుగు మాత్రమే ఉండేది ఛానల్. ప్రస్తుతం తమిళం, కన్నడ, హిందీ , సంస్కృత భాషలలో సైతం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాలు కొనసాగుతున్నాయి. కంటెంట్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదు.
Also Read : Chandra Grahanam : 28న శ్రీవారి ఆలయం మూసివేత