YS Jagan : కృష్ణా జలాల విధి విధానాలపై జగన్ గుస్సా
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కు లేఖ
YS Jagan : అమరావతి – ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా కేంద్రం కృష్ణా జిలాలపై రూపొందించిన విధి విధానాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు లేఖలు రాశారు. కేవలం రెండు రాష్ట్రాలకే ఎలా పరిమితం చేస్తారంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను మినహాయించడం సరికాదని పేర్కొన్నారు జగన్ రెడ్డి.
YS Jagan Comment
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు తాజా విధి విధానాలను ప్రతిపాదించాలని మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. దీనిపై తాజాగా ఏపీ సీఎం(YS Jagan) సైతం స్పందించడం విశేషం.
కేవలం ఏపీ, తెలంగాణకే పరిమితం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు లేఖల్లో. ఏపీ రాష్ట్ర ప్రజల ఆందోళనలను పరిగనలోకి తీసుకోవాలని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు జగన్ మోహన్ రెడ్డి.
ఇదిలా ఉండగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 సెక్షన్ 5(1) ప్రకారం విధి విధానాలు జారీ చేయాలని ఈ నెల 4న కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ నిర్ణయం ఏపీ భవిష్యత్తుకు విఘాతం కలిగించేలా ఉందన్నారు.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
