Perni Nani : ఆస్తులపై విచారణకు బాబు సిద్దమా
ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సవాల్
Perni Nani : తాడేపల్లి గూడెం – ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. తప్పు చేయక పోతే జైల్లో ఎందుకు ఉంచుతారని ప్రశ్నించారు. ఇప్పటికే ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారని, ఏసీబీ కోర్టు రిమాండ్ ఖైదీగా తీర్పు ఇచ్చిందని స్పష్టం చేశారు.
Perni Nani Challenges to Chandrababu
శనివారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నీతిమంతుడు అంటూ పదే పదే బాకాలు ఊదుతున్నారని , పక్కా ఆధారాలతో ఏపీ సీఐడీ కోర్టు ముందు సమర్పించిందని పేర్కొన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి, అక్రమాలకు పాల్పడడంపైనే ఫోకస్ పెట్టాడని ఆరోపించారు.
తాను నీతి మంతుడినని నిరూపించు కోవాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు సిద్దమా అని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) సవాల్ విసిరారు. రోజుకో మాట మాట్లాడుతూ జనాన్ని పిచ్చివాళ్లను చేయాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు.
జనం ఇప్పటికే టీడీపీకి, జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టారని ఈసారి కూడా ఆనాటి సీన్ తిరిగి రిపీట్ కాక తప్పదన్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. ఎవరో స్క్రిప్టు రాసి ఇస్తే చదవడం తప్ప స్వంత పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం అలవాటుగా మారిందన్నారు పేర్ని నాని. జగన్ ను విమర్శించినంత మాత్రాన లీడర్ అయి పోతావా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ కు అంత సీన్ లేదన్నారు.
Also Read : India Crosses 100 Medals : భారత్ ఖాతాలో 100 పతకాలు