TTD JEO : నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో కళారూపాలు
టీటీడీ జేఈవో సదా భార్గవి
TTD JEO : తిరుమల – పుణ్యక్షేత్రమైన తిరుమలలో అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిభ కలిగిన కళా రూపాలను ప్రదర్శించడం జరుగుతుందని స్పష్టం చేశారు టీటీడీ జేఈవో సదా భార్గవి.
TTD JEO Comment
హిందూ ధార్మిక ప్రాజెక్టుల అధికారులతో జేఈవో తిరుపతి లోని టీటీడీ(TTD) పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సదా భార్గవి మాట్లాడారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కళా ప్రదర్శనలకు మంచి స్పందన లభించిందన్నారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింతగా భక్తులను ఆకట్టుకునేలా కళా రూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రోజు వారీగా ఏయే ప్రాంతం నుండి కళా బృందాలు వస్తున్నాయని తెలిపారు జేఈవో, ఎలాంటి ప్రదర్శనలు ఇస్తున్నారనే అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మిజోరం, మణిపూర్ తదితర రాష్ట్రాల నుండి కళా బృందాలు వస్తున్నట్టు సదా భార్గవి స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యంతో పాటు జానపద నృత్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.
Also Read : Tirumala Devotees : పుణ్య క్షేత్రం భక్త జన సందోహం