CM KCR Nominations : 9న సీఎం కేసీఆర్ నామినేషన్లు
ముహూర్తం ఖరారు చేసిన సీఎం
CM KCR Nominations : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల నగారా మోగించింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 3న ప్రభుత్వ పరంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి గెజిట్ రానుంది. 13 వరకు 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు డెడ్ లైన్ విధించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నవంబర్ 15న తమ దరఖాస్తులను ఉపసంహరణ చేసుకునేందుకు గడువు ఖరారు చేసింది ఈసీ.
CM KCR Nominations Update
ఇదిలా ఉండగా ఇప్పటికే 119 స్థానాలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) 115 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. వివిధ కారణాల రీత్యా 7 గురికి మొండి చేయి చూపించారు.
ఎవరూ ఊహించని విధంగా ఈసారి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి తాను రెండు చోట్ల పోటీ చేయనున్నారు. ఈ మేరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు.
నవంబర్ 9న గజ్వేల్ , కామారెడ్డి శాసన సభా నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆరోజు ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లికి వెళతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళతారు. ఆనవాయితీ ప్రకారం అక్కడ పూజలు చేశారు. అనంతరం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
Also Read : CM KCR Tour : ఎన్నికల ప్రచారం సీఎం ముహూర్తం