BRS Party Slams : తెలంగాణ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ అమరుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేసింది భారత రాష్ట్ర సమితి పార్టీ. గురువారం ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేసింది. ఏనాడూ తెలంగాణ ఉద్యమం కోసం పాటు పడిన దాఖలాలు లేవని తెలిపింది.
BRS Party Slams Revanth Reddy
ఒకప్పుడు బ్రోకర్ గా, ఇప్పుడు కరడుగట్టిన బ్లాక్ మెయిలర్ గా పేరు సంపాదించుకున్నాడని , ఆయన గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిదని పేర్కొంది. అసలు తెలంగాణ అమర వీరుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వాపోయింది. హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని ధ్వజమెత్తింది బీఆర్ఎస్ పార్టీ.
1956 నుండి తెలంగాణ కోసం పోరాటం చేసిన వేలాది మంది ఉద్యమకారులు అమరులు కావడానికి, వాళ్ల తల్లి తండ్రులు కడుపు కోతకు గురి కావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. అలాంటి దిక్కు మాలిన, దరిద్రపు పార్టీలో ఉన్న నీకు అమరుల మాట ఎత్తే అర్హత లేదని కుండ బద్దలు కొట్టింది.
ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనని నువ్వు… ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర మరిచి పోయారని అనుకుంటే ఎలా అని బీఆర్ఎస్(BRS) ప్రశ్నించింది. ఒక తండ్రి ఆర్తితో, కుటుంబానికి దూరంగా ఉన్న కొడుకు మీద ప్రేమతో పెట్టిన పోస్టును కూడా రాజకీయం చేస్తున్న నీ నీచ మనస్తత్వాన్ని చూసి సభ్య సమాజం తల దించుకుంటోందని పేర్కొంది బీఆర్ఎస్ పార్టీ.
Also Read : Vijayamma YS Sharmila : ఎన్నికల బరిలో విజయమ్మ..షర్మిల