BRS Manifesto : బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కేసీఆర్ ఫోకస్
ప్రగతి భవన్ లో కీలక సమావేశం
BRS Manifesto : తెలంగాణ – రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. వచ్చే నెల నవంబర్ 3న ప్రభుత్వ పరంగా గెజిట్ రానుంది. నవంబర్ 13న దరఖాస్తులు స్వీకరిస్తారు. ఉప సంహరణకు సంబంధించి నవంబర్ 15 వరకు గడువు విధించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి అవుతాయి.
BRS Manifesto Viral
దీంతో ఇప్పటికే రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్(BRS) బాస్ , సీఎం కేసీఆర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు వరుసగా ప్రగతి భవన్ లో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాను ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గట్టెక్కిస్తాయని నమ్మకంతో ఉన్నారు.
ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై కీలక మీటింగ్ చేపట్టారు కేసీఆర్. మంత్రులు, చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అల్లుడు హరీశ్ రావు, కొడుకు కేటీఆర్ తో వరుసగా భేటీలు కొనసాగిస్తూ వస్తున్నారు కేసీఆర్.
ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మిగతా పార్టీల కంటే ముందుగా మేనిఫెస్టోను ప్రకటించింది. తుక్కుగూడ వేదికగా జరిగిన బహిరంగ సభలో సోనియా ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చారు. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఏమేం హామీలు ఇవ్వబోతున్నారనే దానిపై వేచి చూడాలి.
Also Read : Mynampally Hanumantha Rao : కేసీఆర్ మోసానికి చిరునామా