Revanth Reddy : అక్బ‌ర్ స‌వాల్ రేవంత్ ప్ర‌తి సవాల్

టెంపుల్ వ‌ద్ద‌కు వ‌చ్చే ద‌మ్ముందా

Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించింది. న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు, స‌వాళ్లు విసురుతూ హీటెక్కిస్తున్నారు.

Revanth Reddy and Akbaruddin Comments Viral

తాజాగా జ‌రిగిన స‌భ‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిని(Revanth Reddy) టార్గెట్ చేశారు. ఆయ‌న‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాలు క‌లిగిన వ్య‌క్తి అని, ఆయ‌నను బీజేపీ నియ‌మించిన ఏజెంట్ అంటూ మండిప‌డ్డారు.

తాను కాద‌ని నిరూపించు కోవాల‌ని అనుకుంటే హైద‌రాబాద్ లోని చార్మినార్ వ‌ద్ద ఉన్న భాగ్య‌ల‌క్ష్మి అమ్మ వారి ఆల‌యానికి రావాల‌ని, అక్క‌డ అమ్మ వారి సాక్షిగా ప్ర‌మాణం చేయాల‌ని స‌వాల్ విసిరారు. దీనిపై లేటుగా స్పందించారు రేవంత్ రెడ్డి.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ చేసిన సవాల్ ను తాను స్వీక‌రిస్తున్నాన‌ని, తాను భాగ్య‌ల‌క్ష్మి అమ్మ వారి గుడికి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి త‌ను నా వ‌ద్ద‌కు వ‌చ్చే ద‌మ్ము , ధైర్యం ఉందా అని స‌వాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

Also Read : AP CMO GO : ఏపీ సీఎంఓ విశాఖ‌కు మార్పు

Leave A Reply

Your Email Id will not be published!