K Muraleedharan : పొన్నాల పోతే పోనీ
పర్ ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక
K Muraleedharan : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడంపై తీవ్రంగా స్పందించారు ఎన్నికల పరిశీలకుడు కె. మురళీధరన్(K Muraleedharan). పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే రివ్యూ చేస్తోందన్నారు. పైరవీల వల్లనో లేదా డబ్బులు ఎరగా చూపి తాము టికెట్లను కేటాయించడం లేదన్నారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటేనని పేర్కొన్నారు.
K Muraleedharan Shocking Comments on Ponnala
ఎవరి రాజీనామాపై స్పందించాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమ ఫోకస్ అంతా రాబోయే ఎన్నికల్లో ఎలా పవర్ లోకి రావాలనే దానిపైనేనని స్పష్టం చేశారు. పార్టీలో కొందరు ఉంటే ఉండవచ్చు. లేదంటే వెళ్లి పోవచ్చన్నారు. తాము ఎవరినీ ఉండాలని బలవంతం చేయడం లేదన్నారు. ఎవరినీ దేబరించాల్సిన ఖర్మ పార్టీకి ఉండదని గుర్తు పెట్టుకోవాలన్నారు మురళీధరన్.
గెలుపు అవకాశాలు, పార్టీ పట్ల విధేయత ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 70 సీట్లపై కసరత్తు చేశామని తెలిపారు. మరోసారి సమావేశమై మిగతా స్థానాలపై కసరత్తు పూర్తి చేస్తామని తెలిపారు. మిత్ర పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 70 సీట్లు పూర్తయినట్లు పేర్కొన్నారు.
Also Read : AP DIG Ravi Kiran : చంద్రబాబు ఆరోగ్యం పదిలం