Gudivada Amarnath : బాబుకు కుటుంబీకుల నుంచే ముప్పు
ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ – ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై జైలు ఊచలు లెక్క బెడుతున్న టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై సెటైర్ వేశారు. నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలు అబద్దమన్నారు. నోరుంది కదా అని ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకోవడం భ్రమ అని పేర్కొన్నారు.
Gudivada Amarnath Sensational Comments
చంద్రబాబు ఆరోగ్యం పదిలంగా ఉందన్నారు మంత్రి(Gudivada Amarnath). చంద్రబాబు నాయుడుకు కుటుంబ సభ్యులు పంపే భోజనంపై తనకు అనుమానంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు లోకేష్ బాబుకు తినిపించాకే బాబుకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీఐజీ పరిశీలించాలని సూచించారు.
చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో 66 కేజీలు ఉన్నారని ఇప్పుడు జైలులో 30 రోజులకు పైగా ఉండడంతో మరో కేజీ 67 కేజీలకు పెరిగారని, ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు గుడివాడ అమర్ నాథ్.
చంద్రబాబు , పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ లకు ఏపీతో సంబంధం లేదన్నారు. వీరంతా నార్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ ఎద్దేవా చేశారు. బాబుకు అవసరమైన సమయంలోనే పవన్ కళ్యాణ్ ఏపీకి వస్తారని , ఆ తర్వాత షూటింగ్స్ లో బిజీగా ఉంటారని మండిపడ్డారు.
Also Read : K Muraleedharan : పొన్నాల పోతే పోనీ